మిస్టర్ క్రియేటీవ్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కాంట్రవర్సిటీలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తన షార్ట్ ఫిల్మ్ పై అంత రచ్చ జరుగుతున్నా బయట అనేక విషయాల పై మాత్రం ఓ కన్ను వేసి ఉంచారు. అందులో ముఖ్యమైన టాపిక్ కత్తి మహేష్- పీకే ఫ్యాన్స్ రగడ. గత నాలుగైదు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌కి కత్తి మహేష్‌కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితేఇప్పుడిప్పుడే ఇరువర్గాల వారు కొంత రాజీకి వచ్చి ఘర్షణని సర్దుమణిగేలా చేసుకోవటంతో పరిస్థితి శాంతపడింది.
అయితే కత్తి- ఫీకే ఫ్యాన్స్ వ్యవహారం సద్దుమణిగినా .. ఈ తతంగాన్ని అంత ఈజీగా సోషల్ మీడియా మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ అనేక సామాజిక మాంద్యమాలలో కత్తి పై వ్యంగ్యంగానూ.. ఆయన పొట్ట, పైన.. అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ట్రాల్ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా జనసేన కార్యాలయం నుండి కారీ.. పవన్ నుండి కానీ స్పందన మాత్రం రాలేదు. అయితే పదే పదే పవన్ కళ్యాణ్ తనకి జరిగిన వ్యక్తిగత నష్టానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ తెలుపాలని కత్తి మహేష్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ వ్యవహారంలో వేలు పెట్టాడు. తాజాగా వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కత్తి మహేష్ కి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురవగా.. వర్మ సమాధానం చెబుతూ… విదేశీ పర్యాటకుడి పై భారత దేశంలో ఎవరో ఒకరు చేసిన దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని క్షమాపణ తెలుపమనటం ఎంత అవివేకమో.. కోట్ల సంఖ్యలో అభిమానులని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ వారిలో కొందరు చేసిన పనికి ఎలా బాధ్యత వహిస్తారని.. అసలు పవన్ ప్రమేయం లేకుండా జరిగినదానికి ఆయనని స్పందించి, బాధ్యత వహించి క్షమాపణ తెలుపమనటం కూడా అంతే అవివేకమని వర్మ అన్నారు. దీంతో సోషల్ మీడియాలో కాంట్రవర్సిటీ కింగ్‌గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ప్లేస్‌ని కత్తి మహేష్ కొంత ఆక్యుపై చేయడంతో ఆర్జీవీ – కత్తిని టార్గెట్ చేశారని.. వర్మ ఐటమ్ లిస్ట్‌లలో ఇక కత్తి కూడా ఉంటాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.