ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు.
ఈ సందర్భంగా అదే సమావేశంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ పలకరించారు. మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో కూడా మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. కాగా, కేటీఆర్ కలుపుగోలుతనంతో…ఏపీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
Greeted AP CM @ncbn Garu at the opening session of WEF in Davos
Met with @naralokesh also & conveyed birthday greetings. Good meeting old buddy @jaygalla too? pic.twitter.com/P7R4L66jmT
— KTR (@KTRTRS) January 23, 2018