ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ .
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ,రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన స్పెషల్ స్టేటస్ హమీను నెరవేరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని ప్రకటించాడు.అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ లాంటి అవినీతి పరుడితో మేము కల్సి పని చేయం .మాకవసరం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .
అయితే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతల దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు పలు అవినీతి అక్రమాలు చేస్తున్నారు అని బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ,కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించిన సంగతి తెల్సిందే .అయితే తమ పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో కల్సి పని చేస్తారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీ కల్సి కుట్ర పన్ని పెట్టిన కేసులను షాకుగా చూపించి కామినేని ఇలా వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని రాజకీయ వర్గాలు ముక్కున వేలు వేసుకుంటున్నారు ..