ఒకరేమో ఏకంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం …తొమ్మిది ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ..పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి .మరొకరేమో వందేళ్ల కు పైగా చరిత్ర ఉన్న ..మహామహులు ఏలిన పార్టీను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టి ఎదురుఒడ్డి ..గత ఏడు ఏండ్లుగా ఒంటి చేత్తో పార్టీ నడుపుతున్న యువకుడు .అయితేనేమి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేతకంటే అతని అనుభవం అంత వయస్సున్న యువకుడు బెస్ట్ అంటూ తేల్చేసింది గూగుల్ .
అసలు విషయానికి వస్తే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే నెటిజన్లు గూగుల్ లో ఫాలో అవుతున్నారు అని తేల్చేసింది గూగుల్ . గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,టీడీపీ ,వైసీపీ పార్టీల గురించి ఎవరి గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అనే అంశం మీద గూగుల్ ఒక సర్వే బయటపడింది .
ఈ సర్వేలో నెటిజన్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు అని తేలింది .తొంబై తొమ్మిది శాతం వైసీపీ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి రోజు సెర్చ్ చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గురించి మాత్రం ఒక పది శాతం నెటిజన్లు మాత్రమే గూగుల్ బార్లోకి వెళ్లి టైపు చేసి సెర్చ్ చేస్తున్నారు అంట .అయితే జగన్ విషయంలో ఇరవై ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో ఇరవై రెండు అంశాలు ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర గురించే వాకబు చేస్తున్నారు అని గూగుల్ సర్వే తేల్చేసింది .ఇలాగే కొనసాగితే జగన్ ను దాటడం బాబు కి ఈ జన్మలో సాధ్యం కాదు అని గూగుల్ తేల్చేసింది ..