రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అక్రమ హోర్డింగ్స్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నగరంలో 333 అక్రమ హోర్డింగ్ లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. వీటిని తొలగించడానికి బల్ధియా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సిటీలో అనుమతి లేని హోర్డింగ్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.
నగరంలోని శేరిలింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట ఏరియాల్లో అనుమతి లేని హోర్డింగ్ లను అధికారులు తొలగించారు. అయితే సిటీలో ఉన్న అక్రమ హోర్డింగ్స్ అన్నీ బడా కంపెనీలకు చెందినట్లుగా బల్దియా అధికారులు భావిస్తున్నారు. వీటిపై అధికారులు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.