స్వచ్ సర్వేక్షన్ పై ప్రజల్లో చైతన్యం…బాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ క్రమంలో ప్రజలకు మొబైల్ ద్వారా తన సందేశాన్ని ఇవ్వనున్నారు…
” నమస్కారం ,నేను మీ హరిశ్ రావు ని మాట్లాడుతున్నాను…ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ సర్వేక్షన్ లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది..మన సిద్దిపేట పట్టణాన్ని మీ సహకారం తో బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణనంగా చేసుకొని ఆదర్శంగా నిలిచాం…మీ భాగస్వామ్యం తో ఇంటింటికి చెత్త సేకరణ..దాని నిర్వహణ సమర్థవంతంగా చేస్తున్నాం..హరితహారం లో ముందున్నాం…వీటిని మరింత విజయవంతం చేయడంలో మీ సహకారం ఎంతో అవసరం….ఈ స్వచ్ సర్వేక్షన్ లో పాల్గొని మన సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను..
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 1969 లేక www.swachhsurvekshana2018.org వెబ్ కి లాగిన్ అవ్వండి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుచున్నాను….
” మన ఆరోగ్యం మన చేతల్లో ఉంది……”
” పరిశుభ్రత మన అందరి బాద్యత….”
” మీ అమూల్యమైన స్పందనే…మన పట్టణ విజయానికి నాంది…..”
సిద్దిపేట ప్రజాప్రతినిదిగా బాధ్యత గల పౌరునిగా ఎక్కడికి వెళ్లినా…సందర్భం ఏదైనా సిద్దిపేట స్వచ్ సర్వేక్షన్ లో విజయం సాధించే దిశగా ప్రజలకు తన సందేశాన్ని ఇస్తున్నారు… అలానే మనం బాధ్యత గల పౌరులం గ…సిద్దిపేట జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని మంత్రి కోరుకుంటున్నారు….