జనసేన పార్టీ అధ్యక్షుడు ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఒక ప్రముఖ హోటల్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన అభిమానులు ,జనసేన కార్యకర్తలు ,నేతలతో సమావేశమయ్యారు .ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు.
అయితే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ దగ్గరకి భారీ సంఖ్యలో పవన్ అభిమానులు తరలివచ్చారు .అయితే పవన్ కున్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో వారిని నిలువరించడం వారి వలన కాలేదు .దీంతో ఒక్కసారిగా అందరు ముందుకు తోసుకున్నారు .ఇలా ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో ఒకరిపై మరొకరు పడ్డారు .
దీంతో కోపావేశాలతో కొట్టుకునే స్థాయికి వెళ్ళింది .అంతే కాకుండా ఆవేశం ఆపుకోలేక హోటల్ గదికి ఉన్న అద్దాలపై పడటంతో అవి పగిలాయి .దీంతో అభిమానులకు గాయాలయ్యాయి .