తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ అండ్ ఎనర్జటిక్ జిల్లా కలెక్టర్ ఎవరయ్యా అంటే .. టక్కున వచ్చే సమాధానం ఆమ్రపాలి. ఇప్పుడు ఈ కలెక్టరమ్మ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది ఆమ్రాపాలి. వచ్చే నెల ఫిబ్రవరి 18న ఆమ్రపాలి తన అత్తారింటిలో కుడికాలు పెట్టబోతోంది.
బ్యూటిఫుల్ కలెక్టర్ ఆమ్రపాలి కాబోయే వరుడ్ని చూడండి.. అతనికి సంబంధించిన షాకింగ్ నిజాలు ఇవేనంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం రేపుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఆమ్రపాలికి కాబోయే భర్త ఢిల్లీకి చెంది, 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ అట. ప్రస్తుతం సమీర్ శర్మ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇరువురు కుటుంబాల పెద్దలు పెళ్లిపై ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఆమ్రపాలి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఇది పండుగలాంటి వార్తే. ప్రస్తుతం ఈ వార్త సోసల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.