వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై తనదైన స్టైల్ పోరాటాలు చేస్తూ మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు బాబు సర్కారు పై పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .
తాజాగా గత అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ తరుణంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీలో చేరతారని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పై వస్తున్నా వార్తలు ప్రస్తుతం నిజమై విధంగా ఉన్నాయి .రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై బాబు నిర్లక్ష్యం వహించడం ..గత నాలుగు ఏండ్లుగా జగన్ ఒకపక్క టీడీపీ సర్కారు అవినీతిపై పోరాడుతూనే మరోవైపు ప్రజాసమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న జగన్ నేతృత్వంలో వైసీపీ పార్టీ రానున్న ఎన్నికల్లో పదమూడు ఎంపీ సీట్లను గెలుచుకుంటుంది రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో తేలిపోయింది .
ఇలాంటి తరుణంలో ప్రస్తుతం తాను అనుభవిస్తున్న పదవికి ,నాయకత్వం వహిస్తున్న పార్టీ పుట్టడానికి ప్రధాన కారణమైన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతికి కూడా హైదరాబాద్ లోని అయన ఘాటును సందర్శించే వీలులేకుండా కార్యక్రమాలను చాటుగా పెట్టుకొని చంద్రబాబు తన తండ్రిని అవమానపరిచిన తీరుకు తీవ్ర కలత చెందారు అంట పురందేశ్వరి .అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకే ప్రజలు పట్టం కడతారు అని పలు సర్వేలు తెలుస్తున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వైసీపీ చేరనున్నారు అని దగ్గుబాటి అనుచరవర్గం కోడై కూస్తొన్నారు .అన్ని కుదిరితే త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాలని ఆమె ప్లాన్ లో ఉన్నారు అని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ..