ఆయనో ఎమ్మెల్యే, నిత్యం ప్రజా సేవే..అనునిత్యం తనను ఎన్నుకున్న ప్రజల మధ్యలోనే..తన ప్రజలకు ఈ అపదచ్చిన ఆదుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనెవరో కాదు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆదరించి క్షతగా త్రుడిని తన వెంట వచ్చిన పోలిస్ వాహనంలోకి ఎత్తుకొని ఆసుపత్రికి తరలించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
అసలు వివరాల్లోకి వెళ్ళితే నియోజకవర్గంలోని దర్దేపల్లి దుబ్బతండాకు చెందిన గుగులోతు రాములు నాయక్ తన వాహనంపై కూరగాయల కోసం దగ్గరిలోని తండాకు వెళ్ళాడు.తిరిగి తన ఇంటికి వెళ్ళుతుండగా మల్లంపల్లి వద్ద ఎదురుగా కుక్క రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు.తల,కాళ్ళు,చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ..అదే సమయంలో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను పరిశీలించడానికి పాలకుర్తి నుండి రాయపర్తికి వెళ్ళుతున్న ఎర్రబెల్లి…విషయాన్ని గుర్తించి తన వాహనం ఆపించారు.రాములుకు తలకు బలమైన గాయం తగలడంతో ఎమ్మెల్యే తన టవల్ తో కట్టి చికిత్స కోసం పోలిస్ వాహనంలో ఆసుపత్రికి పంపి తన మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్బంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మన దయన్న నైజం అని అక్కడున్న స్థానికులు ఎమ్మెల్యే పై ప్రశంసల వర్షం కురిపించారు.