వెన్నుపోటు రాజకీయాలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు రాజకీయ విశ్లేషకులు చెప్పే పేరు .గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తనకు పిల్లనిచ్చిన మామ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి ఇటు పార్టీను అటు అధికారాన్ని హస్తగతం చేసుకొని ఆయన మరణానికి కారణమయ్యారు అని చంద్రబాబు పై ఇప్పటికి ఉన్న ఆరోపణలు .అయితే తాజాగా మరో ఎన్టీఆర్ వారసుడుకు వెన్నుపోటు పొడవటానికి బాబు ప్రణాళికలు వేస్తున్నారు అని రాష్ట్ర రాజకీయ ఇన్నర్ వర్గాల్లో టాక్ .
రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం టీడీపీ లో ఉన్న నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వను అని ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్నా టీడీపీ వర్క్ షాప్ సందర్బంగా తేల్చి చెప్పారు అని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు .అందులో భాగంగా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ,హిందూపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ కు సీటు ఇవ్వడం లేదని బాబు చెప్పారు అని ఆ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు తెలుగు తమ్ముళ్ల దగ్గర వాపోయారు అంట .గత నాలుగు ఏండ్లుగా బాలయ్య నియోజకవర్గానికి ఏమి చేయకపోవడం ..పైగా నిత్యం వివాదాల్లో కూరుకుపోవడం వలన బాబుకు సీటు ఇవ్వడంలేదని సదరు నేత అన్నారు అంట .
అయితే రానున్న ఎన్నికల్లో తన తనయుడు ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడ్ని హిందూపురం నుండి బరిలోకి దించాలని ఉద్దేశ్యంతోనే చంద్రబాబు బాలయ్య బాబును పక్కన పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ బాలయ్య బాబు విభేదిస్తే ఎమ్మెల్సీ కట్టబెట్టి పెద్దల సభకు పంపించాలని బాబు యోచిస్తున్నారు ఆ సీనియర్ నేత అన్నారు అంట .అయిన తండ్రి(పెద్దకాకి)కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినోడికి ఆయన వారసుడు (పిల్లకాకి )కి వెన్నుపోటు పొడిచి తన తనయుడు లోకేష్ ను ఎమ్మెల్యే చేసుకోవడం బాబుకు పెద్ద కష్టమా అని తెలుగు తమ్ముళ్లు సదరు నేత దగ్గర సెటైర్లు కూడా వేశారు అంట .చూడాలి మరి తన తండ్రికి వెన్నుపోటు పొడిచి బాబు చెప్పులు వేయించిన సమయంలో పక్కన ఉన్న బాలయ్య బాబు తనకు వెన్నుపోటు పొడిస్తే ఏమి చేస్తారో ..?