ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసి సీఐపై దాడికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆయన.. నడిరోడ్డుపై సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త.. ఆ సీఐని చెప్పులతో కొట్టిన సంగతి తెలిసిందే. పై అధికారి సునితారెడ్డి చనువు ఇచ్చింది. తన కింద పనిచేసే కింది అధికారి మల్లిఖార్జున్ రెడ్డి రెచ్చిపోయాడు.
అయితే రేవంత్ ఒటు కు నోటు కేసు వీరీ మద్య అక్రమ సంబంధం ఏర్పడడానికి కారణభూతమైంది. ఈ ఇద్దరే ఓటుకు నోటు కేసు డీల్ చేసిన అధికారులు. ఓటుకు నోటు కేసు నడుస్తున్న క్రమంలోనే సునితారెడ్డికి డిఎస్పి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి ప్రమోషన్ లభించింది. సునితారెడ్డి 2007 లో గ్రూప్ అధికారిగా ఎంపికై డిఎస్పీగా డ్యూటీ లో చేరారు. తాజాగా అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందిన సునీతారెడ్డే ఓటుకు నోటు కేసు ఇప్పటికీ డీల్ చేస్తున్నారు. అయితే ఈ కేసు తర్వాత తన కింద పనిచేసే మల్లిఖార్జున్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం సునీతారెడ్డి కుటంబసభ్యలకు తెలిసింది.గత రెండు రోజుల క్రితం భార్య సునితారెడ్డికి చెప్పకుండానే అమెరికా నుంచి దిగిన ఆయన సునితారెడ్డి ఇంటికి ఆదివారం రాత్రిపూట వచ్చిన మల్లిఖార్జున్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓటుకు నోటు కేసే వీరిద్దరి అక్రమ సంబంధానికి కారణమైందని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.