ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం గత నాలుగు ఏండ్లుగా ఎలా టీడీపీ సర్కారు హయంలో అణిచివేయబడుతుంది ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి టీడీపీ పార్టీ కింది స్థాయి కార్యకర్త వరకు ఎలా దళితులను అవమానపరుస్తున్నారో ..ఏవిధంగా కించాపరుస్తున్నారో వివరించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్లు అన్ని వైసీపీ కి పడేవిధంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దళితులు ,ఎస్టీల భూములు ఎవరు అక్రమించుకోకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పెట్టి ప్రత్యేక చట్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు .ఎస్సీ ,ఎస్టీల భూములను టచ్ చేయాలంటేనే భయపడే విధంగా చట్టాలు తీసుకొస్తాం అని ఆయన అన్నారు ..