చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మీ అందరికీ బైక్‌లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మరి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు కదా..? ఒక్కసారి తమిళనాడు బాడర్‌కు వెళ్లి పెట్రోలు ధర ఎంతో కనుక్కోండి అక్కడ ఏపీలో పోల్చితే రూ.6లు తక్కువగా ఉంటుంది. అలాగే కర్ణాటకలో అయితే ఏపీతో పోల్చితే రూ.7లు తక్కువగా ఉంటుంది అంటూ చెప్పారు.
ప్రత్యేక ప్యాకేజీపై కోర్టుకు వెళ్తామని చెప్పిన చంద్రబాబు.. ముందు కేంద్రంలో మంత్రులుగా ఉన్నది మీ వాళ్లు కాదా..? అంటూ ప్రశ్నించారు. ముందుగా వారిచేత రాజీనామ చేయించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. నాడు తనమీద కేసులను కొట్టేయించుకునేందుకు కేంద్రం వద్ద సాగిలపడ్డ చంద్రబాబు.. ప్రత్యేక హోదాను సైతం తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాడని, కనీసం ప్రత్యేక ప్యాకేజీని కూడా రాబట్టుకోలేని పరిస్థితితో చంద్రబాబు సర్కార్ ఉందని ఎద్దేవ చేశారు జగన్.
ఇప్పుడు చంద్రబాబు డ్రామాలన్నీ ఒక అడుగు ముందుకేశాయన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చంద్రబాబు గ్యాంగ్ డ్రామా కంపెనీని తెరిచాయని, కేంద్రంతో విభేదిస్తున్నామని ఒకరు. లేదు లేదు అంటూ మరొకరు.. ఇలా ఒకడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్.