జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రపై మీడియాతో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నలకు ఒక్క తీరునా సమాధానం చెప్పకపోగా.. మీడియాకే ప్రశ్నలు తలెత్తేలా ప్రసంగించారు. అయితే, మీరు పాదయాత్ర చేస్తారా..? లేక రోడ్ షో చేస్తారా..? లేక బస్సు యాత్ర చేస్తారా..? అన్న ప్రశ్నలకు పవన్ ఒక్క తీరునా సమాధానం చెప్పలేదు.
నేను బస్సు యాత్ర చేస్తానో..! లేక పాదయాత్ర చేస్తానో..! అది పాజిబులిటీ మీద ఆధారపడి ఉంటుందని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్.
ఇలా పవన్ కల్యాణ్ తన యాత్రపై అస్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో.. అజ్ఞాతవాసి చిత్రంలోని డైలాగ్‌తో ముడిపెడుతూ పవన్‌పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటనేగా మీ డౌట్. అదే పవన్ చర్యలే కాదు.. యాత్రలూ ఊహాతీతమే అంటూ..