జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జనసేనపార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్‌కు ఆయన సతీమణి అన్నా లెజ్‌నోవా ఎదురొచ్చి హరతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశీ భార్య చేత తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీ ఫక్కీలో సాగినా.. ఇక ప్రసంగాలు గత ప్రజారాజ్యం పంథాలోనే సాగుతాయనడంలో సందేహం లేదు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. పవన్ ప్రారంభించిన ఈ యాత్ర ఎన్ని రోజులు సాగుతోందనేది మరో డౌట్. ఎందుకంటే ఆంజనేయ దర్శించుకోవడం వరకూ ఓకే అయినా 3 రోజుల యాత్ర అని చెప్పడం హాస్యాస్పదమే.
ఇదేదో అజ్ఞాతవాసి ప్రమోషన్ ఈవెంట్‌లా అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మూడు రోజుల్లో తిరగగల్గిన ఊర్లు చుట్టేసి.. తిరిగి హైదరాబాద్ రావడంలో అర్ధం ఏం ఉంటుంది.. లేకపోతే దీనివెనుకా ఏదైనా వ్యూహం ఉందా అది ఆయనకే తెలియాలి. ఇంకోవైపు చూస్తే జగన్ అటు చిత్తూరు దాటి నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోకి దూసుకొచ్చేశాడు. జనం నీరాజనాలు పడుతున్నారు. అయితే జగన్ వెంట నడుస్తోన్న జనం నిజంగా ఓట్లేస్తారో లేదో 2019 ఎన్నికలలో తెలుస్తోంది. అంటే ఇక్కడ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న జగన్‌కే తన గెలుపు పై సస్పెన్స్ కొనసాగుతుంటే… పవన్ కల్యాణ్ మాత్రం తన బలం తేల్చుకోవడానికే ఇలా రెండ్రోజులు మూడురోజుల యాత్రతో ఏం తెలుసుకుంటాడన్నది నిజంగానే అగమ్యగోచరమే. ఇక్కడ అసలు జోక్ ఏంటంటే.. ఆయనేదో ఇప్పటికే రెండు రాష్ట్రాలు చుట్టేసినట్టు ఆయన అభిమానులు సీయం సీయం అంటూ నినాదాలు చేయడం చూస్తుంటే.. పాదయాత్ర అంటే రెండు గంటల వెండితెర పై ఆడే సినిమా అనుకుంటున్నారో ఏమో అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.