టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు.
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు .ఆయన మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని కొట్లాడి మరి తెచ్చారని ప్రజలు నమ్మారు .అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించారు .
ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని ఎవరు విస్మరించకూడదు .గత ఎన్నికల్లో ప్రజలు తమపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో వాటిని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సీఎం ..డెవలప్మెంట్ సీఎంగా ఇటు రాష్ట్ర ప్రజలచేతనే కాకుండా యావత్తు దేశమంతా మెచ్చుకునేలా పాలనను కొనసాగిస్తున్నారు .రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు .