Home / SLIDER / ఎన్‌ఆర్‌ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..మంత్రి కేటీఆర్

ఎన్‌ఆర్‌ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..మంత్రి కేటీఆర్

బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణ వాసులు కలిసి రావాలని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.  స్విజర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఆయన తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో వాటి అమలు వంటి అంశాల పైన మంత్రి సుధీర్గంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల పైన కూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు నాటి అయోమయ పరిస్థితి నుంచి ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ట్రాలు కూడా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితులల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం మూడున్నర యేండ్లలోనే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతమైన విధానాలతో ముందుకు పోతుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన లక్ష్యాల సాధన దిశగా ప్రయాణం మొదలైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను సాధిస్తామని మంత్రి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వ్యతిరేకించినవారే వారే ప్రస్తుతం అభినందనలు తెలుపుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పక్క రాష్ట్రం నుంచి కూడా పార్టీ పెట్టాలన్న విజ్ఞపుతులు వస్తున్నాయంటేనే ఇక్కడ పాలన ఎంత జనరంజకంగా సాగుతున్నదో అర్ధమవుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన మాట్లాడిన మంత్రి కేటీ రామారావు రాష్ట్రం విడిపోతే కరెంటు సమస్యలు వస్తాయన్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకి పవర్ కష్టాలు తొలగిపోయాయి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పవర్ పోయిందన్నారు. కేవలం రాష్ర్టంలోనే కాదు దేశంలోనూ మెత్తం కాంగ్రెస్ పవర్ పోతున్నదని, అందుకే రైతాంగానికి ఇస్తున్న 24 గంటల కరెంట్ సరఫరాను సైతం రాజకీయం చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో ప్రజల కనీస అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రం అంతటా తాగు, సాగునీరు కల్పననకే ముఖ్యమంత్రిగారు అత్యధిక ప్రాదాన్యత ఇస్తున్నరని, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజల కనీస అవసరాలైన ఎటువంటి రోడ్లు ఫుట్పాత్లు తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాల పైన ప్రధానంగా దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని దశదిశల చాటేందుకు తెలంగాణ ఎన్నారైలు కలిసి రావాలన్నారు. ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుడ్ విల్ అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్లు గా ఉండాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఇతరదేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి ఎన్నారై మిత్రులు కలిసి రావాలని అన్నారు.

ప్రసంగం అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఓపికగా సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్లను చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎన్నారైలు తెలంగాణలో భూములు కొనాలంటే ఇక ధైర్యంగా కొనవచ్చని, భూ రికార్డుల ప్రక్షాళన చేసి అన్నీ ఆన్లైన్ లోకి తెస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. చెరువుల ప్రక్షాళన, హైదరాబాద్ నగరంలో మెరుగు పడిన శాంతి భద్రతలు, వాతావరణ కాలుష్యం, క్రీడల అభివృద్ది మెదలయిన అంశాలపైన మంత్రి సమాధానాలు అందజేశారు.

 

సమావేశంలో పాల్గోన్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహాన్ మాట్లాడుతూ తెలంగాణ ఎర్పాటు ద్వారా అధికారంలో ప్రజల అకాంక్షలు తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నారని, అయన నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పొతుందన్నారు. నగరలో గత రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్దిని అయన సమావేశంలో వివరించారు. నగర ప్రజల నాడి తెలిసిన మంత్రి కెటి రామారావు మార్గదర్శనంలో నగరం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలను దగ్గరుండి రూపకల్పన చేసి, అమలును నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. నగరాభివృద్దికి ఏన్నారైలు చేసే సూచనలు, సలహాలు తీసుకునేందుకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

జ్యూరిచ్ నగరంలోని శ్రీదర్ గండె, అల్లు క్రిష్ణ రెడ్డి, అనిల్ జాలా, కిశోర్ తాటి కొండ తదితరులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వీడన్, జర్మనీ, యూకె, స్విజ్జర్లాండ్ దేశాల నుంచి తెలుగువారు మంత్రి ముఖాముఖి సమావేశానికి హజరయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat