ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి కేఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా దళితులను ఎలా మోసం చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ..దాడులను వివరించారు.అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితులకు వైసీపీ పార్టీ ఏమి చేయబోతుందో కూడా వివరంగా వివరించారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జవహర్ సోమవారం రాష్ట్ర సచివాలయం అమరావతిలో మాట్లాడుతూ “వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి..దళితులను మోసం చేస్తున్నారు.కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల పట్ల దేవుడు.వారిని ఆదుకోవడానికి అన్ని రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నారు అని అన్నారు ..