జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేస్తున్న రాజకీయ యాత్రలో ఓ హీరోయిన్ పాల్గొననుందని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అందులో భాగంగానే పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు సినీ గ్లామర్ తోడవ్వనుంది. అయితే, పవన్ రాజకీయ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే సినీ నటి పూనం కౌర్ .. పవన్ రాజకీయ యాత్రలో పాల్గొననుందని సమాచారం. ఇప్పుడు ఇదే వార్త జనసేన కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇలా జనసేన కార్యకర్తలు చర్చించుకోవడంలో వాస్తవాలు లేకపోలేదు. అయితే, ఇందుకు ఆజ్యంపోస్తూ పూనం కౌర్ నిన్న ట్విట్టర్ వేదికగా ఐ లవ్యూ పవన్ కల్యాణ్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. అదే పీకే ప్రేమ. తెలుసుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉందా? ఇంకా ఎవరైనా వస్తారా?’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇదే ట్వీట్ ఆసరాగా చేసుకున్న కొందరు నెటిజన్లు పవన్ కల్యాన్ యాత్రలో పూనం కౌర్ పాల్గొంటుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.