వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనుందని సమాచారం. అయితే, ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక, కాంగ్రెస్ తన గత వైభవాన్ని కోల్పోవడంతోపాటు మరో 20 సంవత్సరాల వరకు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితులన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ నాయకులు ఇలా వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం కిల్లి కృపారాణి వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.