ముంబై అంటే విలాసవంతమైన జల్సా జీవితాలే కాదు.. పచ్చనోటు కోసం ఒళ్లు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. పచ్చనోట్లు కోసం సుఖం అందించే సెక్స్‌వర్కర్లు కామాటిపురా కాచుకుని ఉంటుంది. అయితే, తప్పని పరిస్థితుల్లో పొట్టగడవడం కోసం తల్లులు తప్పని సరి పరిస్థితుల్లో ఆ పనిచేస్తారునుకుంటే సరే..! కానీ వారి పిల్లల పరిస్థితేంటి..? వారు కూడా తల్లుల బాటలో నడవాల్సిందేనా..?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది సెక్స్ వర్కర్ శీతల్ అనే యువతి. తన జీవితంలో జరిగిన, తనపై జరిగిన లైంగిక దాడుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శీతల్. తన తల్లి తాను పుట్టాక బార్ డ్యాన్సర్‌గా మారిందని, అప్పటికే తన తండ్రి అమ్ము వదిలేశాడని చెప్పింది శీతల్. తన పెంపుడు తండ్రి అయితే ఒక కూతురినని కూడా చూడకుండా తనపైనే లైంగిక దాడికి పాల్పడే వాడని, తనకు ఊహకూడా తెలియని పరిస్థితిలో అలా చేయడంలో.. అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి తనదని చెప్పింది. అందులోనూ అమ్మ బార్ డ్యాన్స్‌కు పోతే.. తనకు తిండిపెట్టే వాళ్లు కూడా ఉండే వారు కాదని, బంధువుల ఇళ్లలో పనిచేస్తేనే తనకు తిండిపెట్టేవారని చెప్పింది. ఇప్పటి వరకు సమాజంలో చీత్కారాలు ఎదుర్కొన్నా, ఇకపై నాకు అటువంటి చీత్కారాలు ఎదురయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే క్రాంతి స్వచ్ఛంద సంస్థ నన్ను ఆదుకుంది. నాకు కొత్త జీవితం అందించింది.
నేను క్రాంతి స్వచ్ఛంద సంస్థను సంప్రదించినప్పుడు నీవు ఇక్కడే ఉండొచ్చని, అంతేగాక, నీకు నచ్చిన వృత్తినే ఎంచుకోమన్నారు. అయితే, నాకు డ్రమ్స్ వాయించడం ఇష్టమని చెప్పడంతో క్రాంతి స్వచ్ఛంద సంస్థ వారు అందుకు అంగీకరించారని, మ్యూజీషియన్‌గా మారడమే తన ఆశయమని చెప్పింది శీతల్.