ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తామన్నారు. అంతేగాక ప్రియతమ నేత వైఎస్సార్ స్ఫూర్తితో ప్రతి పెదవారికి ఇళ్లను కట్టిస్తామని జగన్ అన్నారు.. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామని జగన్ స్పష్టం చేశారు. పేదలకు భూపంపిణీ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ ప్రజల నుంచే ప్రారంభిస్తానన్న ఆయన.. ఉచితంగా బోర్లు కూడా వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్లకే ఇవ్వాలని చట్టం చేస్తామని.. పేద ఎస్సీలు అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే ఈ మాటలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఆనందంతో జగన్ పై పూల వర్షం కురిపించినట్లు సమచారం. ఏపీలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి ఓటు వేస్తారని ఆయా సంఘాలు తెలుపుతున్నాయి.
