ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 66 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో తన పాదయాత్రను పూర్తిచేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా ప్రజల ఆదరణతో విజయవంతంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్.
ఇక అసలు విషయానికొస్తే.. ప్రజల్లో ప్రస్తుతం జగన్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించిన పలు దిగ్గజ మీడియా సంస్థలు సైతం ప్రజా సంకల్ప యాత్రకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. దివంగత నేత ఎస్ రాజశేఖర్‌రెడ్డిలా అందరినీ పలుకరిస్తూ ప్రజలకు దగ్గరవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రజా సంకల్ప యాత్ర మొదట్లో ఆ దిగ్గజ మీడియా సంస్థలు, పత్రికలు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వని విషయం తెలిసిందే. కానీ ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించిన వారు పాదయాత్ర మొదలైన రెండో నెల నుంచే లైవ్ ఇవ్వడం కానీ.. తమ పేపర్లలో ప్రత్యేక పేజీని జగన్ కోసం కేటాయిస్తూ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా జగన్‌కు ప్రజలతోపాటు మీడియా సంస్థలు కూడా మద్దతుగా నిలవడంతో రానున్న సాధారణ ఎన్నికల్లో జగన్ గెలుపు నల్లేరుపై నడకేనంటన్నారు రాజకీయ విశ్లేషకులు.