ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. చలి జ్వరంతో బాధ పడుతున్నట్టు ప్రకటించారు. తక్షణం పాదయాత్రకు విరామం ఇచ్చి కోలుకున్నాక కొనసాగించాలని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు సూచించారు. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించి నప్పటికీ జగన్ తోసిపుచ్చారు. ఆదివారం యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాళహస్తి పెళ్లిమండపం కూడలిలో బహిరంగ సభ జరుగుతుందని జగన్ స్పష్టం చే శాడు. జగన్ వైఖరిపై అటు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు.
