జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్నవిషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెలిగారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్ ఇస్తారన్నారు. ఆంధ్రాలో ఏపి విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన వైజాగ్ లో దళిత మహిళపై జరిగిన అకృత్యం పై స్పందించిన పవన్ తెలంగాణపై ఎందుకు స్పందించలేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కి పవన్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. పవన్ మొక్కు తీర్చుకోవడానికి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు .. కానీ రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమన్నారు.