జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ తన నిరంతర ప్రజాయాత్రకు చలోరే చలోరే…చల్ పేరును ఖరారు చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో బయలుదేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలోని ఆంజనేయస్వామి కి పూజలు జరుపుతారు. అనంతరం తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారు.
సాయంత్రం కరీంనగర్ కు చేరుకొని జనసేనకు చెందిన స్థానిక ముఖ్య ప్రతినిధులతో మాట్లాడతారు. 23 వ తేదీ కరీంనగర్ లోని జగిత్యాల రోడ్ లో ఉన్న శుభం గార్డెన్స్ లో 1045 నిముషాలకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళతారు. సుమారుగా సాయంత్రం 6 .30 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు.
రాత్రికి కొత్తగూడెం లో బస చేస్తారు. 24 వ తేది ఉదయం 9.30 కొత్తగూడెం నుంచి ప్రదర్ళగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 కి ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మం లోని ఎం.బి.గార్లెన్స్ లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ కు పయనమవుతారు.