మాములుగా మనం నిమ్మ రసాన్ని ఇంతవరకు ఆహారంలో ఉపయోగించుకోవడం లేదా చర్మ సౌదర్యాన్ని పెంచుకోవడంకోసం ఉపయోగిస్తుంటాం..కాని నిమ్మకయతో ఈ లాభాలే కాక మరెన్నో ఉపయోగాలున్నాయి.నిమ్మరసంలో మిటమిన్ సీ తో పాటు..మన శరీరాన్ని కాపాడే కీలక పోషకాలు ఎన్నో వున్నాయి.ప్రతి రోజు ఉదయం పరిగడుపున ఈ నిమ్మ రసాన్ని తీ సుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఒక గ్లాసాడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా వుంటారు.పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
- నిమ్మరసంలో మిటమిన్ సీ యన్టీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.
- నిమ్మరసంలో సహజసిద్దమైన యాంటీ ఫంగల్, యాంటీ బయోటెక్ ,యాంటీ వైరల్ గుణాలు వుండటం వల్ల పలు ఇన్ఫెక్షన్లు దరి చేరావు.
- నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అవి మన చర్మాన్నిఆరోగ్యంగా, కాంతి వంతంగా వుంచడంతో పాటు.. ముడతలు,మచ్చలు తొలిగిపోతాయి.ఇందులో పోటాషియం అధికంగా వుండటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- ప్రస్తుత కాలంలో మనం పిల్చే గాలి,త్రాగే నీటి వల్ల మన శరీరంలో విష పదార్ధాలు వచ్చి చేరుతుంటా యి. ప్రతి రోజు నిమ్మ రసాన్ని తీ సుకోవడం వల్ల మన శరీరంలో వున్నా వ్యర్థలు బయటికి పోతాయి.ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
- అధిక బరువుతో బాధపడేవారు..రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండుకొని తీ సుకోవడం వల్ల శరీరంలో మేటబొరిక్ శాతాన్ని పెంచుతుంది.తద్వారా అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
- గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండుకొని తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన మలినాలు బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది.గ్యాస్ ,అసిడిటి,కాస్ట్ పేషన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి .ఇలా రోజు నిమ్మకాయ రసం నీళ్ళు తీ సుకోవడంవల్ల కొన్ని రోజుల్లోనే మలబద్ధక సమస్యలనుండి విముక్తి పొందవచ్చు.
- రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని తీ సుకోవడం వల్ల శరీరంలో పోటాషియం స్థాయి పెరుగుతాయి.సిక్రెట్ లేవల్లు మెరుగుపడుతా యి.దీ న్తో కిడ్నిలోని రాళ్ళూ తగ్గిపోతాయి.గొంతు నొప్పి ,గొంతు సమస్యలను తగ్గిస్తుంది.జలుబు జ్వరం రాకుండా కాపాడుతుంది.
ఇలా రోజు ఉదయం నిమ్మరసం తీ సుకోవడం వల్ల ఎలాంటి మెడిసిన్ అవసరం ఉండదు.
One comment
Pingback: కొత్తిమీర తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే – Dharuvu