హైదరాబాద్ లో మాదాపూర్ ,మియపూర్ కుకట్ పల్లిలో చెడ్డి గ్యాంగ్ దోపిడీలకు తెగబడిన సంగతి తెలిసిందే..నిన్నటికి నిన్న కడపలో ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడి తాలం తీస్తుండగా పక్క ఇంట్లో వాళ్లు రాగనే ముల్లకొంపల్లోకి దూకి పరారుయ్యారు. తాజాగా కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్‌చల్ చేసింది. న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్‌లలో చోరీలకు పాల్పాడ్డారు. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు పెట్టారు. నాలుగో ఇంట్లో చోరీకి వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. బనియన్, చెడ్డీలు వేసుకున్న 25 ఏళ్ల యువకులు ఈ ముఠాలో ఉన్నట్టు వారు చెబుతున్నారు. స్థానికులు గుర్తించడంతో దొంగలు పరారయ్యారు.
