ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ద పర్సనల్ ఈజ్ పొలిటికల్’ అనే కార్యక్రమంలో సినీ తారలు గౌతమి, ఖుష్బూ, ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ‘ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దని కేంద్రం ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?’ అని ఆయన అడగ్గా
‘సెక్స్’ రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా.. కండోమ్ ప్రకటనను మిడ్ నైట్ మసాలా లాగా రాత్రి 11గం. తర్వాతే ప్రసారం చేయాలనడం హాస్యాస్పదం. శృంగారం రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా. పగలు కూడా చేస్తుంటారు. కాబట్టి.. పగలు కూడా కండోమ్ ప్రకటనలు ప్రసారం చేయాలని కుష్బూ అన్నారు. మరోక నటి గౌతమి కండోమ్ అనేది సంతానోత్పత్తిని తగ్గించడానికే కాదు సురక్షిత శృంగారానికి ముఖ్యం. ప్రైమ్ టైమ్ లోనే కండోమ్ యాడ్స్ అనేవి ఎక్కువమందికి చేరడం కోసమే కదా అన్నారు
