రెజీనా. ప్రస్తుతం అటు కోలీవుడ్‌తోపాటు.. ఇటు టాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. రెజీనా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే హీరోలతో సమానంగా అంతే ఎనర్జిటిక్‌గా నటించగలదు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే మొదటి చిత్రంతో హిట్ కొట్టిన రెజీనా వరుస అవకాశాలు దక్కించుకున్నా కూడా స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకోలేక పోయింది. రవితేజ, గెపిచంద్ వంటి సీనియర్ హీరోలతో నటించినా సరే స్టార్ హీరోల పక్కన మాత్రం చాన్స్ దక్కలేదు ఈ భామకు.
అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. 2017 సంవత్సరం తనకు అస్సలు కలిసి రాలేదని, 2018లో మాత్రం తన కెరియర్ గొప్పగా కొనసాగుతుందని ఆశాబావం వ్యక్తం చేసింది. అయితే, 2017లో రెజీనా నటించిన కురుక్షేత్రం, బాలకృష్ణ వంటి చిత్రాలు బాక్సీఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం తెలిసిందే.
అయితే, నేచురల్ స్టార్ నాని స్వీయ నిర్మాణంలో వస్తున్న అ చిత్రంలో రెజీనా ఓ పాత్రలో నటిస్తోంది. అందులో రెజీనా పాత్ర గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందట. డ్రగ్స్‌కు బానిసైన అమ్మాయిగా నటించడంతోపాటు తన హెయిర్‌ను అండర్కట్ చేయించుకుందట రెజీనా. మరి 2017 కలిసిరాలేదు సరే.. కనీసం 2018 సంవత్సరమైనా రెజీనాకు కలిసొస్తుందో ..? లేదో..? చూడాలి మరి.