ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేషీ అవినీతి కంపుకొడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి సీఎంఓ ఎంతో ముఖ్యం. సీఎంవో పనితీరునుబట్టి రాష్ట్ర పరిపాలను అర్థంచేసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏపీ సీఎం సీఎంవో మాత్రం అవినీతి కంపుకొడుతోంది. అయితే, సీఎం దృష్టికి వచ్చే ప్రతీ సమస్య సీఎంవో కార్యాలయానికి వెళ్తుందన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన సామాన్య ప్రజల వద్ద సీఎంవో కార్యాలయ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని, ఉన్నతాధికారులు సీఎంవో కార్యాలయ సిబ్బందికే వంత పాడుతుండటంతో సామాన్య ప్రజలు ఏం చేయలేక వెను తిరుగుతున్నారు.
అయితే, గతంలో ఐవైఆర్ కూడా సీఎంవోపై కోర్టులో కేసు వేస్తానని పత్రికా ముఖంగా చెప్పిన మాట పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో మళ్లీ సీఎంవో కార్యాలయం వార్తల్లో నిలవడంతో ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తికి లేనంత అనుభవం తనకే ఉందని చెప్పుకునే చంద్రబాబు… ఇలా తన పరిధిలోని సీఎంవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై స్పందించకపోవడం ఏంటని, కనీసం ఇప్పికైనా కళ్లు తెరికి సీఎంవో కార్యాలయ ప్రక్షాళనకు పూనుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.