వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. భాద్యతలు స్వీకరించిన మొదటినుండి ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది.అయితే త్వరలోనే ఈ కలెక్టరమ్మ పెళ్ళిపీటలేక్కబోతుంది.నమ్మడం లేదా అవునండి నిజమే.. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు ఎవ్వరనుకుటున్నారా..? 2011 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ.ఆమ్రపాలి హృదయాన్ని దోచిన సమీర్ శర్మ డిల్లీ కి చెందినవారు .ప్రస్తుతం ఈయన ఎస్పీ గా పనిచేస్తున్నాడు.అయితే ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన పెద్దలు పెళ్ళికి ఓకే చెప్పేశారట.ఆమ్రపాలి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదిరిచుస్తున్న వారికి ఇది పండుగాలాంటి వార్తే ..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.