ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా కొన్ని లక్షల సంఖ్యలో యువత, మహిళలు, రైతులు, చేతి వృత్తుల వారు జగన్ కు మద్దతు పలుకుతున్నారు. తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. వీరి సమస్యలన్నింటినీ ఎంతో ఓపికగా వింటూ, మనం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను తీరుస్తానంటూ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. అంతేగాక పాదయాత్ర బాగా హిట్టు అవ్వడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం అని టీడీపీ నేతలే అంటున్నాట్లు సమచారం.
