ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న జీఎస్టీ ( గాడ్, సెక్స్, ట్రూత్)పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఫోర్న్ చూడటం లీగల్ అని, తీయడం మాత్రమే ఇల్లీగల్ అని చెప్పుకొచ్చింది. అసలు శృంగారం అనేది.. ఆకలితో సమానం అంటూ డిమాండ్ ఎక్కువ ఉన్న చోటే.. సప్లై కూడా పెరుగుతుందని వ్యాపార సూత్రాలను అన్వయించి మరీ సెక్స్‌ను విశదీకరించింది గాయత్రి గుప్తా. మోడీ ప్రభుత్వం వచ్చాక ఇండియాలో ఫోర్న్ వీడియోలను బ్యాండ్ చేశారని, కొన్ని రోజుల తరువాత ఫోర్న్ వీడియోలపై బ్యాండ్ ఎత్తేశారని చెప్పారు.