జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతున్న, తనకు హైప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు చేశాడు కత్తి మహేష్. అంతేగాక ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ విషయాలను కూడా నేను మాట్లాడొచ్చా..? అంటూ ఎదురు ప్రశ్నించాడు కత్తి మహేష్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి నైతికతను ప్రశ్నించేసి.. దాని ద్వారా ఈయనకు మాట్లాడే హక్కు లేదు అని అనేస్తారా..? అలా అయితే పవన్ కల్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెప్పేందుకు నేను రెడీ.. వినేందుకు మీరు రెడీనా..! మాట్లాడుకుందాం అంటూ పవన్ కల్యాణ్ అభిమానులకు సవాల్ విసిరాడు. అలాగే పవన్ కల్యాణ్ వల్ల ఎంత మంది ప్రొడ్యూసర్ల, ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం అయ్యాయో అన్నీ తనకు తెలుసునంటూ.. ఈ విషయాలన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా బయటపెట్టాలో తనకు తెలుసని చెప్పారు కత్తి మహేష్. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త చాల దారుణంగా వైరల్ అవుతున్నది. ఫ్యాన్స్ అయితే ఎవరు అమ్మాయిలు చేప్పండి అని కొందరు…నీకు ఎలా తెలుసు అని కొందరు..వాళ్లు వీళ్లేనా మరికొందరు కామెంట్స్ తో సోషల్ మీడియాలో ధుమారం రేగుతున్నాయి.
