కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఉపాధి కార్యక్రమం కింద సుమారు 25 వేల మంది వికలాంగులకు ఆర్థిక సహకారం అందించాలని, ఆడిప్ పథకం కింద పెండింగులో ఉన్న 20 కోట్లు వెంటనే విడుదల చేయాలని, మరికొన్ని ప్రతిపాదనలను కేంద్రమంత్రి తావర్ చంద్ దృష్టికి తీసుకెళ్లారు.