2014 ఎన్నికల్లో బూటకపు హామీలు చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రపై ఓ టీడీపీ నేత స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల రైల్వే అధికారుల సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే, ఈ సమావేశం ముగింపు అనంతరం జేసీ దివాకర్‌రెడ్డి తన తోటి ఎంపీలతో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారట. అందులో భాగంగానే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై కూడా చర్చించుకున్నారట. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వైఎస్ జగన్ ప్రజలకు బాగా దగ్గరవుతున్నారని, జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూస్తుంటే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా ఉన్నాడని వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. కాబట్టి మనం కూడా ఫలితం ఉన్నా.. లేకున్నా ప్రజా క్షేత్రంలో ఉండేందుకు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాల్సిందేనంటూ తోటి ఎంపీలతో జేసీ దివాకర్‌రెడ్డి అన్నట్లు సమాచారం. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
