ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్‌లో ఉన్నట్లు చంద్రబాబు రెండు నెలల క్రితం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు చంద్రబాబు శానససభ్యుల తీరుపై కన్నేసి, సర్వే చేయించినట్లు తెలిపారు. తగిన సమయం.చూసి .. ఆ 40 మంది ఎమ్మెల్యేలకు నమస్తే చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు చెబుతున్నారు.
