భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: ఆంధ్రప్రదేశ్‌లో 400, తెలంగాణలో 255 ఖాళీలు
విద్యార్హత: SBI ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులకు జనవరి 1, 2018 నాటికి 20-28ఏళ్లలోపు ఉండాలి.SC,ST లకు ఐదేళ్లు,OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిలో సడలింపుల వర్తిస్తాయి.
పరీక్షవిధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతీ తప్పునకు పావుశాతం చొప్పున మార్కుల తగ్గింపు ఉంటుంది. జనవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 10తో గడువు ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలు మార్చి/ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మెయిన్స్ మే 12న నిర్వహించడం జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.