నాకు అనైతికతను అంటగట్టి.. నా ఆర్గ్యుమెంట్‌కు, అభిప్రాయాలకు క్రెడిబిలిటీ లేదని నిరూపించాలని ప్రయత్నం చేస్తే.. అతను అసలు మనిషే కాదని నిరూపిస్తా.. త్రివిక్రమ్ అనే వాడిని తీసుకురండి అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడ్డాడు కత్తి మహేష్.
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ మొదటిసారి పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. (అంతకు ముందు.. ఒక అమ్మాయికి మీరు చేసిన వాట్సప్ మెసేజ్‌లు ఇప్పుడు స్ర్కీన్ మీద డిసిప్లే చేస్తాను.. ఆ మెసేజ్‌లు చేసింది మీరేనా..? ఏ నేపథ్యంలో మీరు అలా మెసేజ్‌లు చేయాల్సి వచ్చింది మీరు చెప్పాల్సి ఉంటుందని అడిగిన విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ స్పందిస్తూ..) అలా అయితే, పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ విషయాలను కూడా నేను మాట్లాడొచ్చా..? అంటూ ఎదురు ప్రశ్నించాడు కత్తి మహేష్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి నైతికతను ప్రశ్నించేసి.. దాని ద్వారా ఈయనకు మాట్లాడే హక్కు లేదు అని అనేస్తారా..? అలా అయితే పవన్ కల్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెప్పేందుకు నేను రెడీ.. వినేందుకు మీరు రెడీనా..! అంతేకాదు ఇప్పుడున్న పెళ్లాం నిద్రపోతుంటే అర్థరాత్రిపూట ఎవర్ని పంపడానికి పవన్ కల్యాణ్ కారు వేసుకుని రోడ్డుమీదకొస్తాడో నాకు తెలుసు.. మాట్లాడుకుందాం అంటూ పవన్ కల్యాణ్ అభిమానులకు సవాల్ విసిరాడు. అలాగే పవన్ కల్యాణ్ వల్ల ఎంత మంది ప్రొడ్యూసర్ల, ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం అయ్యాయో అన్నీ తనకు తెలుసునంటూ.. ఈ విషయాలన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా బయటపెట్టాలో తనకు తెలుసని చెప్పారు కత్తి మహేష్.