ప్రముఖ వివాదల రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు అయిన వర్మపై విజయవాడలో బిజెపి నేతలు పోలీస్ కేసు పెట్టారు.
జీఎస్‌టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు.దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా అంటూ రాంగోపాల్ వర్మ ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపిన నేపధ్యంలో వారు కేసు పెట్టారు. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు…ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతం అని బిజెపి మహిళా నేతలు మండిపడుతున్నారు.
