దేశంలో మహిళలపై దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిర్భయలాంటి ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధుల నుండి మహిళలు తప్పించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా వావి వరుసలు మరచి చాల నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తన సోంత అల్లుడే కదా అన్ని నమ్మి అతని వేంట వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా లోని సిద్ధిపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు సంవత్సరం క్రితం భర్త మరణించాడు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి జీవిస్తూ కూలి పనులకు వెళ్తుండేది. ఇందులోభాగంగానే గురువారం ఇదే మండలం శేర్‌బందారం కూలి పని చేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే.. అదే గ్రామంలో అల్లుడు (కుమార్తె భర్త)కి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఎప్పుడు అవకాశం వస్తుందో అని చాలా రోజులనుండి అల్లుడు అనుకుంటుడగా ..ఇంకా ఇదే సరియైన సమయం అనుకోని ..అల్లుడు బైక్ వేసుకుని పొలం వద్దకు వచ్చి అత్తను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మార్గమధ్యంలో ఉన్న మహ్మద్‌షాపూర్ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ప్రతిఘటించిన దారుణంగా కొట్టి రేప్ చేశాడు. తరువాత ఆమెను సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేర్చాడు. అయితే జరిగిన విషయాన్ని కుమారులకు చెప్పిన ఆమె అదే రోజు రాత్రి దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.