ఇప్పటి వరకు మనం భార్యా భర్తల గొడవలు చాలానే చూశాం. వేరే మహిళపై మోజుతో భార్యపై పైశాచికత్వం ప్రదర్శించడం.. అలాగే పెళ్లైన కొన్ని నెలలకే భార్యా భర్తల మధ్య మనస్పర్ధలతో రావడంతో విడాకులు తీసుకోవడం నేటి సమాజంలో మామూలైపోయింది. ఆ కోవకు చెందినదే చిత్తూరు ఘటన. గత సంవత్సరం డిసెంబర్లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయింది.
ఇక అసలు విషయానికొస్తే.. ఆ రోజు శోభనం గదిలో ఏం జరిగిందో అన్న విషయాన్ని వెల్లడించాడు రాజేష్. శోభనం రోజున శైలజ చాలా ఆవేశంగా వచ్చి చేయమని అడిగిందట. తనకు అదే మొదటి సారి అని, దీంతో శైలజ ఆవేశాన్ని గ్రహించలేక పోయానని చెప్పాడు రాజేష్. దీంతో తనను, తన తల్లిదండ్రులను శైలజ తీవ్ర పదజాలంతో దూషించిందని.. కోపం తట్టుకోలేకనే శైలజపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పాడు రాజేష్.