తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చాణుక్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. కుఠిల రాజకీయాల్లో అయితే మరీను. ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. చంద్రబాబు తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఇంకా పెంచుకునేందుకు కోసం జాతీయ ప్రాజెక్టులను సైతం నేనే నిర్మిస్తానంటూ డంబికాలు పలికి.. తీరా చతికిలపడ్ విషయం అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు రాజకీయ దిగజారుడు తనానికి అలాగే జగన్ ఎదుగుదలకు ఇది ఒక కారణం.
ఇకపోతే కాపుల రిజర్వేషన్ అంశం. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఆ తరువాత అధికారం చేపట్టాక ఆ మేనిఫెస్టోని కాస్తా పక్కన పెట్టారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ అసెంబ్లీలో తూతూ మంత్రంగా తీర్మాణం ప్రవేశపెట్టి.. దానికి ఆమోదముద్ర వేసిన ఏపీ ప్రభుత్వం.. తీరా తీర్మాణాన్ని ఇనుపపెట్టెలోపెట్టి.. కేంద్రం వద్ద ఉంచింది. ఇంతకీ కాపుల అంశం ఏమైందని అడిగితే.. కేంద్రానికి పంపాం.. నిర్ణయం మోడీ చేతిలో ఉందంటూ చేతులు దులుపుకుంది చంద్రబాబు సర్కార్.
ఇలా చంద్రబాబు సర్కార్ ఆడుతున్న డబుల్‌గేమ్‌ను కేంద్రం పెద్దలు గమనిస్తూనే.. చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల అంశం, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇలా చంద్రబాబు చేస్తున్న తప్పిదాలను కాస్తా కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకుంటూ.. ప్రజల్లో సానుభూతి పొందే యత్నం చేస్తుండటంతో గమనించిన బీజేపీ నేతలు చంద్రబాబుపై సీరియస్‌గా ఉన్నారట. ఇప్పుడు ఇవే అంశాలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గెలుపుకు అస్ర్తాలుగా మారాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.