అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ కామాంధ బాబాలు పేట్రేగిపోతున్నారు. అందులోను మహిళా భక్తులపై మరింత ప్రేమ చూపుతున్నట్లు నటిస్తూ.. వారి కామ కలాపాలను తీర్చుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలో కొత్తేమి కాకపోయినా.. రోజుకొకటి వెలుగులోకి రావడం గమనార్హం. అయితే, గత సంవత్సరం డేరా బాబా రాస లీలలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ సంవత్సరం ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల్లో గజల్ శ్రీనివాస్ కామ కలాపాలు సంచలనం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో ఓ ఆశ్రమానికి చెందిన బాబా ఏకంగా నలుగురు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో బస్తీ జిల్లా కేంద్రంలో ఓటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఆశ్రమాన్ని నడుపుతున్న సచ్చిదానంద్ అతని ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తమపై లైంగికంగా దాడి చేయడమే కాక.. అత్యాచారం చేశారని నలుగురు సాధ్వీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు సాధ్వీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.