టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు.తెలుగుదేశం సృష్ఠికర్త ఎన్టీఆర్ మంచి వ్యక్తని, ఆయనకు లంచం అంటే తెలియదని,అన్నగారు నన్ను రాజ్యసభకు పంపారు. ఎలాంటి మచ్చా లేకుండా పదవీ కాలాన్ని పూర్తి చేశానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేగాక ఇంకా ఏ రాజకీయ నాయకుడు కలెక్షన్ కింగ్ మాటలపై స్పందించలేదు.