తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య తీపికబురు అందించారు.రాష్ట్రంలోని ఐదు పురపాలికల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ తరఫున నేడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతున్న హైదరాబాద్ ఫ్రీ వైఫైకి కొనసాగింపుగా…ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం పురపాలక ప్రాంతాల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందించనున్నారు. వైఫై హాట్ స్పాట్ల ద్వారా ఈ ఉచిత సేవలు అందించనున్నారు. నగరానికి చెందిన ప్రజలు, అక్కడికి వచ్చే ప్రయాణికులు, అతిథులకు ఉపయుక్తంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ జీవోలో రాష్ట్ర ఐటీ శాఖ వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయంపై ఐదు పురపాలక సంతోషం వ్యక్తమవుతోంది. ప్రజలకు మెరుగైన ఐటీ సేవలు అందించేందుకు ప్రభుత్వమే ముందుకు రావడం సంతోషకరమని పేర్కొంటున్నారు.