అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం.
ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడిన అనంతరం మైక్ అందుకున్న లక్ష్మీ అనే మహిళ మాట్లాడుతూ.. అన్నా.. జగన్ అన్నా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. అన్నా మామకు 67 ఏళ్లుపైన వయసు ఉంటుందన్నా.. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికి వెళ్లినా సరే.. పింఛన్ కోసం అర్జీ ఇస్తామన్నా.. అయినా.. కూడా మీ మామకు ఇంకా వయసు కాలేదు.. ఇంకా.. వయసు కాలేదు అంటూ అంటున్నారే తప్ప.. ఆధారాలు చూపించినా కూడా పింఛన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎన్నికల సమయంలో గడప గడప తొక్కి.. కాళ్లు పట్టుకుని ఓట్లు అడుక్కున్న అనుభవం మరిచిపోయాడా చంద్రబాబూ..? అంటూ ఆ మహిళ ప్రశ్నించింది. ఈ చంద్రబాబు నాయుడు పాలనలో ఆడదానికి స్వేచ్ఛగా బతికే హక్కు లేదని, టీడీపీ నాయకులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని చెప్పింది. వీధికో బెల్టుషాపు ఓపెన్ చేసిన చంద్రబాబు.. భర్తలను తాగుబోతులుగా మారుస్తున్నారన్నారు. ఇటువంటి చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నించింది.
చంద్రబాబు గురించి మరో విషయం చెప్తూ… ఈ నెల 14వ తేదీన చంద్రబాబు రేణిగుంటకు వచ్చాడని, ఆ సమయంలో బస్సులను, ఆటోలను నడపకుండా పోలీసులు బంద్ చేశారని, ఏం ఆయన వస్తే.. మేం ప్రయాణించకూడదా..? మేం భయపడాలా..? నేను గనుకు.. ఆ దారిలో వెళ్లుంటే.. చంద్రబాబు బతికిపోయాడని,, లేకుంటే అడిగి ఉండేదానినంటూ చెప్పింది. చంద్రబాబుకు ఓటే వేయనంటూ లక్ష్మీ తన ప్రసంగాన్ని ముగించింది.