మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్‌లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇంకా ఆయన మాట్లాడుతూ. వంచన వేరు.. ఆత్మ వంచన వేరు అని, వంచన విషయంలో మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి పర్సంటేజ్ ఉంటుందని, కానీ ఆత్మ వంచనలో అలా కాదన్నారు.
ఇందుకు నిదర్శనం.. ఇటీవల కడపలో చంద్రబాబు నాయుడు వైసీపీ ఎంపీపై చేయి చేసుకోవడమే. ఎంపీ చేతిలో ఉన్న మైకును లాక్కోవడంతోపాటు.. ఇది ప్రభుత్వ మీటింగ్ అని, పార్టీ మీటింగ్ కాదంటూ బుకాయించారు చంద్రబాబు. ఈ అంశంపై మాట్లాడిన ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా టీడీపీ కార్యక్రమంగా నిర్వహించలేదా.? అంటూ ప్రశ్నించారు. ఇకపోతే శ్రీకాకుళంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైఫై తానే ఇచ్చినట్లు చెప్పుకున్నాడని ఎద్దేవ చేశారు. ఇలా ప్రభుత్వ మీటింగ్ ఏది జరిగినా కూడా నేను ఇచ్చా.. నేను చేశా… అంతా నేనే అంటూ చెప్పుకోవడం చంద్రబాబు వ్యక్తిత్వానికే సిగ్గుచేటని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్.